లైంగికంగా వేధించాడు

ABN, Publish Date - Dec 16 , 2024 | 04:43 AM

బాలీవుడ్‌ సంగీత దర్శకుడు రాజేశ్‌ రోషన్‌ తనను లైంగికంగా వేధించారని గాయని లగ్నజితా చక్రబర్తి ఆరోపించారు. సంగీత చర్చల కోసం తన ఇంటికి పిలిచిన రాజేశ్‌ రోషన్‌ అసభ్యకరంగా తాకారని...

బాలీవుడ్‌ సంగీత దర్శకుడు రాజేశ్‌ రోషన్‌ తనను లైంగికంగా వేధించారని గాయని లగ్నజితా చక్రబర్తి ఆరోపించారు. సంగీత చర్చల కోసం తన ఇంటికి పిలిచిన రాజేశ్‌ రోషన్‌ అసభ్యకరంగా తాకారని ఆమె చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో లగ్నజితా మాట్లాడుతూ ‘నేను ముంబైలో ఉన్న రోజుల్లో ఓ సారి రాజేశ్‌ రోషన్‌ పిలవడంతో వారి ఇంటికి వెళ్లాను. వాద్య పరికరాలతో నిండి ఉన్న గదిలోకి నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నాక్కొంచెం దూరంలో ఆయన కూర్చున్నారు. నేను ఫోన్‌ చూస్తుండగా, రాజేశ్‌ రోషన్‌ నెమ్మదిగా నా వైపు కదలడం గమనించాను. అతను ఏం చేస్తాడో చూద్దాం అని నేను గమనించనట్లే ఊరుకున్నాను. రాజేశ్‌ రోషన్‌ నా స్కర్ట్‌లోకి తన చేతులను దూర్చాడు. నేను వెంటనే తేరుకొని అక్కడ నుంచి బయటకు పరుగుతీశాను. జగుప్సాకరమైన ఆ సంఘటన గురించి కెమెరా ముందు మాట్లాడలన్నా సిగ్గుగా ఉంది.


మొదట దిగ్ర్భాంతికి గురయ్యాను. అయితే జరిగిన దాంట్లో నా తప్పేం లేదు, అతనిది దిగజారుడు వ్యక్తిత్వం అని అర్థం చేసుకొని, ఆ సంఘటన వల్ల క్షోభకు గురికాకుండా నన్ను నేను కాపాడుకున్నాను’ అని తెలిపారు. లగ్నజితా ఆరోపణలపై రాజేశ్‌ రోషన్‌ స్పందించలేదు.

Updated Date - Dec 16 , 2024 | 04:43 AM