టీవీ రంగంలోనూ లైంగిక వేధింపులు

ABN, Publish Date - Aug 31 , 2024 | 06:08 AM

సీనియర్‌ నటి కుట్టిపద్మిని తమిళ చిత్రసీమతోపాటు టీవీ రంగంలోనూ మహిళలపై లైంగిక వేధింపులకు కొదువలేదని సీనియర్‌ నటి కుట్టిపద్మిని ఆరోపించారు. ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లోనే కాదు టీవీ సీరియల్స్‌లో

సీనియర్‌ నటి కుట్టిపద్మిని

చెన్నై (ఆంధ్రజ్యోతి) : తమిళ చిత్రసీమతోపాటు టీవీ రంగంలోనూ మహిళలపై లైంగిక వేధింపులకు కొదువలేదని సీనియర్‌ నటి కుట్టిపద్మిని ఆరోపించారు. ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లోనే కాదు టీవీ సీరియల్స్‌లో నటించే యువతులు కూడా లైంగిక వేధింపులకు గురవడం సహజంగా మారిపోయింది. అలా వేధింపులకు గురయ్యేవారు సమాజానికి భయపడి ఎవరికీ ఫిర్యాదు చేయడం లేదు. పారితోషికాలు పెద్ద మొత్తంలో లభిస్తుండటంతో కొంతమంది ఈ లైంగిక వేధింపులను భరిస్తున్నారు. ఫిర్యాదు చేసేవారికి మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశాలు లభించడం లేదు. నటుడు సురేశ్‌ గోపీపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయంటూ కొంతమంది అడుగుతున్నారు, ఆధారాలు ఎవరిస్తారు?’ అని ఆమె ప్రశ్నించారు. దీనికి సీబీఐ విచారణ లాగా లై డిటెక్టర్లతో పరీక్షల చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. దర్శకులు, సాంకేతిక నిపుణుల నుండి మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారని, అవి భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని కుట్టి పద్మిని పేర్కొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 06:08 AM