మహిళల భద్రతకు కమిషన్‌ ఏర్పాటు చేయండి

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:29 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళల రక్షణ, భద్రత మెరుగుపరచడం కోసం ఇండస్ర్టీలోని మహిళలే ప్రాతినిథ్యం వహించేలా ఒక కమిషన్‌ వేయాలని ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వాన్ని...

తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళల రక్షణ, భద్రత మెరుగుపరచడం కోసం ఇండస్ర్టీలోని మహిళలే ప్రాతినిథ్యం వహించేలా ఒక కమిషన్‌ వేయాలని ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

హేమ కమిటీ నివేదికపై ప్రత్యేక ధర్మాసనం

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో నమోదైన కేసులపై విచారణ జరిపేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని కేరళ హైకోర్టు ఏర్పాటు చేయనుంది. హేమ కమిటీ రిపోర్ట్‌ను బహిర్గతం చేయడానికి అనుమతిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మహ్మద్‌ ముస్తాఖ్‌, జస్టిస్‌ ఎస్‌. మను మదేతో కూడిన ధర్మాసనం మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుపై మౌఖిక ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - Sep 06 , 2024 | 12:29 AM