విడుదలకు సీక్వెల్
ABN, Publish Date - Nov 05 , 2024 | 06:41 AM
గతేడాది తమిళంలో విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న చిత్రం ‘విడుదల’. దీనికి సీక్వెల్‌గా రూపొందిన సినిమా ‘విడుదల 2’...
గతేడాది తమిళంలో విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న చిత్రం ‘విడుదల’. దీనికి సీక్వెల్‌గా రూపొందిన సినిమా ‘విడుదల 2’. వెట్రీ మారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించారు. సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘డిసెంబరు 20న ‘విడుదల 2’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న చిత్రమిది. ఇందులో విజయ్ సేతుపతి, సూరి నటన హైలెట్‌గా నిలుస్తాయి’ అని తెలిపారు.