మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విడిపోవడమే మా ఇద్దరికీ మంచిది

ABN, Publish Date - May 15 , 2024 | 12:24 AM

తమిళ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్‌ కుమార్‌, గాయని సైంధవి దంపతులు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. విడాకులు తీసుకొన్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిద్దరూ సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన...

తమిళ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్‌ కుమార్‌, గాయని సైంధవి దంపతులు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. విడాకులు తీసుకొన్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిద్దరూ సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మేమిద్దరం ఎంతో ఆలోచించిన మీదటనే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇది మా ఇద్దరికీ మంచిదని నమ్ముతున్నాం. ఇకపై ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తాం. మా కెరీర్‌లో మరింత రాణించేందుకు ఈ మార్పు దోహదం చేస్తుందనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’ అని జీవీ, సైంధవి ప్రకటనలో పేర్కొన్నారు. వారిద్దరూ 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కూతురు అన్వీ ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు జీవీ మేనల్లుడు అవుతాడు. ‘అసురన్‌, సూరారైపొట్రు, రాజారాణి, ఒంగోలు గిత్త’ తదితర చిత్రాలకు జీవీ సంగీతం అందించారు. హీరోగానూ పలు చిత్రాల్లో నటించారు.

Updated Date - May 15 , 2024 | 12:24 AM