హీరోయిన్‌ను చూసి హీరో ఉరుకులు, పరుగులు

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:25 AM

‘హుషారు’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యువ కథానాయకుడు తేజస్‌ కంచర్ల నటించిన తాజా చిత్రం ‘ఉరుకు పటేలా’. వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాలభాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల...

‘హుషారు’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యువ కథానాయకుడు తేజస్‌ కంచర్ల నటించిన తాజా చిత్రం ‘ఉరుకు పటేలా’. వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాలభాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేవారు. ఈ సినిమా గురించి వివరిస్తూ ‘పెళ్లి వయసు వచ్చినా హీరోకి పెళ్లి కాదు. కారణం అతనికి చదువు అబ్బలేదు. కానీ బాగా చదువుకున్న పిల్లనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అతని ఆశలకు తగ్గట్లే హీరోయిన్‌ అతన్ని ప్రేమిస్తుంది. ఎవరికీ నచ్చని హీరోను ఈ హీరోయిన్‌ ఎలా ప్రేమించిందా అన్నదే కథలో ట్విస్ట్‌. హీరోయిన్‌లోని మరో కోణం బయటకు రావడంతో హీరో భయపడి పారిపోవాలని అనుకుంటాడు. ఆమెని చూసి ఎందుకలా పారిపోవాలని అనుకున్నాడన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’ అని చెప్పారు దర్శకనిర్మాతలు.

Updated Date - Aug 27 , 2024 | 04:25 AM