Zebra: సత్యదేవ్ క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్ విడుదల

ABN, Publish Date - Sep 17 , 2024 | 10:56 PM

ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి.. మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.

Satya Dev in Zebra

ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satya Dev), కన్నడ స్టార్ డాలీ ధనంజయ (Daali Dhananjaya) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ చిత్రం ‘జీబ్రా’ (Zebra). ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఈ రోజు, మేకర్స్ ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌‌ను రిలీజ్ చేశారు. మైండ్ బ్లోయింగ్ మోషన్ పోస్టర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. (Zebra Motion Poster)

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ మోషన్ పోస్టర్.. సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, డాలీ ధనంజయ, సత్య దేవ్‌లని పరిచయం చేసింది. ప్రతి పాత్రను ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో ప్రజెంట్ చేశారు. మోషన్ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. చివరి ఫ్రేమ్‌లలో మొత్తం నటీనటులు కనిపిస్తున్నారు. మోషన్ పోస్టర్‌లో కాయిన్ తిప్పడం, కరెన్సీ నోట్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి కారు దూకడం వంటి ఎక్సయిటింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ క్రియేటివ్‌గా ప్రజెంట్ చేశారు. (Zebra Release Date)


రవి బస్రూర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ని మరింత పెంచింది. ఈ మైండ్ బ్లోయింగ్ మోషన్ పోస్టర్ ద్వారా ‘జీబ్రా’ అక్టోబర్ 31న అన్ని దక్షిణ భారత భాషల్లో, హిందీలో థియేటర్లలోకి రానుందని అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్‌ ఈ దీపావళి మరింత స్పెషల్‌గా వుండబోతోందని ప్రామిస్ చేస్తోంది. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 17 , 2024 | 10:56 PM