మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Satish Raj: దర్శకుడిగా మారుతున్న మరో కొరియోగ్రాఫర్.. ప్రముఖుల ఆశీస్సులు

ABN, Publish Date - May 23 , 2024 | 06:27 PM

తెలుగుతెరపై ఇప్పటి వరకు పలువురు కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారారు. ప్రభుదేవా, లారెన్స్, విజయ్ బిన్నీ, గణేష్ మాస్టర్ వంటి కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి భారీ సినిమాలు రూపొందించారు.. రూపొందిస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్ కూడా చేరబోతున్నారు. ఎస్ఆర్ మూవీ జంక్షన్ పేరుతో ఓ బ్యానర్ స్థాపించి మరీ ఆయన సినిమాలు చేయబోతున్నారు.

SR Movie Junction Banner Logo Launch

తెలుగుతెరపై ఇప్పటి వరకు పలువురు కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారారు. ప్రభుదేవా, లారెన్స్, విజయ్ బిన్నీ, గణేష్ మాస్టర్ వంటి కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి భారీ సినిమాలు రూపొందించారు.. రూపొందిస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్ (Choreographer Satish Raj) కూడా చేరబోతున్నారు. ఎస్ఆర్ మూవీ జంక్షన్ (SR Movie Junction) పేరుతో ఓ బ్యానర్ స్థాపించి మరీ ఆయన సినిమాలు చేయబోతున్నారు. ఈ బ్యానర్ లోగోను తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) ఆవిష్కరించారు. సాయిబాబా భక్తుడైన సతీష్ రాజ్ (Satish Raj).. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను బాబాకు అంకితమిస్తూ శ్రద్ధ సబూరి పేరుతో ఓ పాటను రూపొందించారు. ఈ పాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కలిసి ఆవిష్కరించారు.

*Bengaluru Rave Party: పేరు మార్చిన హేమ, అసలు పేరేంటో తెలిస్తే షాకవుతారు!


ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఒక దర్శకుడు సినిమా మొత్తాన్ని మూడు గంటల్లో చూపిస్తే కేవలం మూడు నిమిషాల్లో కథ మొత్తం అర్థమయ్యేలా ఒక్క పాటలో చూపించగలిగిన దర్శకుడే కొరియోగ్రాఫర్ అని అన్నారు. సతీష్ రాజ్ లాంటి కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం వల్ల చిత్రపరిశ్రమలో ఎంతో మంచి సినిమాలు వస్తాయని చెప్పారు. సినిమా ప్రారంభించే ముందు సాయి బాబాకు పాటను అంకితం ఇవ్వడం సతీష్ రాజ్‌కు సినిమాపై ఉన్న పట్టుదలను తెలియజేస్తుందని అన్నారు. దర్శకుడిగా మారుతున్న సతీష్ రాజ్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. (Choreographer Satish Raj Turns Director)


ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ (Damodar Prasad) మాట్లాడుతూ.. ప్రతి కొరియోగ్రాఫర్ ఒక దర్శకుడే. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు చాలా మంది ఉన్నారు. వారంతా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి అవకాశం ఇప్పుడు సతీష్ రాజ్ మాస్టర్‌కు వచ్చింది. ఆయనలో ఉన్న ప్రతిభ ఏంటి? అనేది ఇప్పుడు దర్శకుడి రూపంలో అంతా చూడబోతున్నారని తెలిపారు.

*Natti Kumar: ప్రజలు విసిగిపోయారు.. అందుకే సాగనంపుతున్నారు!


సతీష్ రాజ్ మాస్టర్ దర్శకుడిగా మారడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) అన్నారు. కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ అయిన సతీష్ రాజ్ భవిష్యత్తులో దర్శకుడిగా కూడా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. కొరియోగ్రాఫర్, దర్శకుడు విజయ్ బిన్నీ మాట్లాడుతూ సతీష్ రాజ్‌కు.. తనకు ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉందని, అన్ని విధాలుగా అనుభవం ఉన్న సతీష్ రాజ్ దర్శకుడిగా మారడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Read Latest Cinema News

Updated Date - May 23 , 2024 | 06:27 PM