సంక్రాంతి స్పెషల్
ABN, Publish Date - Dec 24 , 2024 | 05:10 AM
వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ట్రయాంగులర్ క్రైమ్ కామెడీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు...
వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ట్రయాంగులర్ క్రైమ్ కామెడీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమాలో మూడో పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సంక్రాంతి స్పెషల్‌గా.. సినిమాకే హైలైట్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ పాటకు భానుమాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఒక మాజీ పోలీసు.. మాజీ ప్రేయసి.. అద్భుతమైన భార్య మధ్య జరిగే అందమైన ప్రయాణంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న చిత్రం విడుదల కానుంది. కాగా, వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఇది వరకు వచ్చిన ‘ఎఫ్ 2’.. ‘ఎఫ్ 3’ చిత్రాలు మంచి విజయం సాధించాయి.