Sharwa37: శర్వా సినిమాలో దియాగా సంయుక్త.. ఫస్ట్ లుక్ విడుదల

ABN, Publish Date - Sep 11 , 2024 | 09:46 PM

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 37వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ సంయుక్త లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు.

Samyuktha in Sharwa37

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 37వ (Sharwa37) మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిలేరియస్ రైడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా సాక్షి వైద్య, సంయుక్త (Samyuktha) హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ పోస్టర్ ద్వారా ఆమె పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో దియా (Samyuktha as DIA)గా సంయుక్త నటిస్తోంది.

Also Read- Tammareddy Bharadwaja: తప్పు చేశానని ప్రూవ్ చేస్తే దేనికైనా రెడీ..



ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఇందులో సంయుక్త సంప్రదాయ శాస్త్రీయ నృత్యం చేస్తూ.. అచ్చమైన, స్వచ్చమైన తెలుగమ్మాయిలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌ని షేర్ చేస్తూ.. నెటిజన్లు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. Sharwa37 చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీ, భాను బోగవరపు కథ, నందు సావిరిగాన డైలాగ్స్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర సహ నిర్మాత కాగా కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఇతర విషయాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

Also Read-Malaika Arora Father: ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి అనిల్ అరోరా..

Read Latest Cinema News

Updated Date - Sep 11 , 2024 | 09:46 PM