సమంతకు ఏమైంది?

ABN, Publish Date - Aug 24 , 2024 | 06:46 AM

సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ బన్నీ’తో ప్రేక్షకులను పలకరించనున్నారు సమంత. ఆమె సినిమాలు తగ్గించినా.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. అలానే అప్పుడప్పుడు పలు

సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ బన్నీ’తో ప్రేక్షకులను పలకరించనున్నారు సమంత. ఆమె సినిమాలు తగ్గించినా.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. అలానే అప్పుడప్పుడు పలు ఈవెంట్లలో పాల్గొని ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటారు. అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత బ్లాక్‌ డ్రస్సులో వచ్చారు. ఈ సందర్భంగా తీసుకున్న వీడియోను ఆమె అభిమానులతో సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఇక అప్పటి నుంచి అభిమానుల కామెంట్లు మొదలైయ్యాయి. ‘సమంతకు ఏమైంది... ఆమె మునుపటిలా ఎందుకు అందంగా కనిపించట్లేదు. బరువు తగ్గినట్లుంది. ముఖంలో ఆనందం కనిపించట్లేదు’ అని పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 06:46 AM