Samantha : హాని చేయాలనే తలంపు లేదు

ABN, Publish Date - Jul 06 , 2024 | 05:36 AM

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ వైద్య వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గత వారం సమంత నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్‌ చేసి, ‘వైరల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మందులకు

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ వైద్య వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గత వారం సమంత నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్‌ చేసి, ‘వైరల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మందులకు బదులుగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, డిస్టిల్డ్‌ వాటర్‌ కలిపి పీల్చితే మేజిక్‌లాగా పనిచేస్తుంది’ అని సూచించారు. అయితే ఈ విధానాన్ని కొంతమంది వైద్యులు సోషల్‌ మీడియాలో తప్పుపట్టారు. అప్పటికే దెబ్బ తిన్న ఊపిరి తిత్తులలోకి హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ప్రవేశిస్తే, న్యుమోనియా సహా పలు వ్యాధులను కలగజేస్తుంది. కొన్నిసార్లు మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ‘ఇంతకంటే బుద్ధి తక్కువ పని లేదు. సమంతకు ఆరోగ్యం, విజ్ఞానశాస్త్రం గురించి ఏమీ తెలియదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు ఆమెను జైలుకు పంపాల’ని ఫిలిప్స్‌ అనే వైద్యుడు సమంతను ఘాటుగా విమర్శించారు. స్పందించాడు. తనపై విమర్శలు రావడంతో స్పందించిన సమంత, మర్యాదకరమైన భాష ఉపయోగించాలని ఆ డాక్టర్‌ను కోరారు. ‘ఇవన్నీ నాకు వైద్యులు చెప్పిన సలహాలే , ఎవరికీ చెడు చేయాలనే తలంపు నాకు లేదు. నన్ను లక్ష్యంగా చేసుకునే బదులు, ఈ విధానాన్ని నాకు సూచించిన డాక్టర్‌తో మీరు చర్చ జరిపితే బావుండేద’న్నారు. సమంత వివరణపై శుక్రవారం డాక్టర్‌ ఫిలిప్స్‌ స్పందిస్తూ, బాధితురాలిగా చూపించుకునే ప్రయత్నం మానుకోని, నిజా నిజాలు తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయాలని సమంతకు సూచించారు. మానిటైజేషన్‌ కోసమే కొంతమంది సెలబ్రిటీలు ఇలాంటివి చేస్తున్నారని, వారికి ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 05:36 AM