మీ ఫోన్‌ నంబర్‌ ఇస్తారా?

ABN, Publish Date - Oct 19 , 2024 | 06:29 AM

సల్మాన్‌ ఖాన్‌ మాజీ ప్రియురాలు సోమీ అలీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు వైరల్‌ అయింది. ఆమె లారెన్స్‌ బిష్ణోయ్‌ని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నమస్తే

సల్మాన్‌ ఖాన్‌ మాజీ ప్రియురాలు సోమీ అలీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు వైరల్‌ అయింది. ఆమె లారెన్స్‌ బిష్ణోయ్‌ని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నమస్తే లారెన్స్‌ భాయ్‌’’... అంటూ సోమీ అలీ తన సందేశాన్ని మొదలు పెట్టారు. ‘‘మీరు జైలు నుంచే జూమ్‌ కాల్‌ చేస్తున్నారని విన్నాను. నేను కూడా మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అందుకు మార్గం ఏమిటో చెప్పండి. మన ప్రపంచంలో అన్నింటికంటే అందమైన ప్రదేశం రాజస్థాన్‌. మేము మీ దేవాలయానికి రావాలనుకుంటున్నాం. కానీ అంతకంటే ముందుగా మేము మీతో జూమ్‌ కాల్‌ మాట్లాడాలి. కొన్ని విషయాలు చెప్పాలి. నా మాట నమ్మండి. ఇది నేను మీ ప్రయోజనం కోసమే చెబుతున్నాను. నాకు మీ మొబైల్‌ నెంబరు ఇవ్వండి‘ అంటూ సోమీ అలీ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

Updated Date - Oct 19 , 2024 | 06:29 AM