భారీ బందోబస్తుతో సల్మాన్‌ఖాన్ షూటింగ్
ABN, Publish Date - Nov 04 , 2024 | 05:36 AM
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా ఏ. ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘సికందర్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మురుగదాస్, కథానాయిక రష్మిక మందన్నతో కలసి ఆదివారం సల్మాన్‌ఖాన్ హైదరాబాద్‌లో...
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా ఏ. ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘సికందర్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మురుగదాస్, కథానాయిక రష్మిక మందన్నతో కలసి ఆదివారం సల్మాన్‌ఖాన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ నెల 7వ తేదీ వరకూ సల్మాన్‌ఖాన్ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో సల్మాన్, రష్మికపై ఓ పాటతో పాటు కొంత టాకీపార్ట్‌ను చిత్రీకరించనున్నారు. సల్మాన్‌ఖాన్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించిన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య ఆయన చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సినిమా యూనిట్‌ను తప్ప షూటింగ్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.