Mercy Killing: ఆర్టికల్ 21 ఆధారంగా.. ప్రతి మహిళ కచ్చితంగా చూడాల్సిన చిత్రం
ABN, Publish Date - Mar 30 , 2024 | 05:38 PM
సాయి సిద్ధార్థ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన చిత్రం ‘మెర్సి కిల్లింగ్’. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పణలో సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
సాయి సిద్ధార్థ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన చిత్రం ‘మెర్సి కిల్లింగ్’ (Mercy Killing). సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పణలో సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోన వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. (Mercy Killing Pre Release Event)
ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ (Sai Kumar) మాట్లాడుతూ... ‘మెర్సీ కిల్లింగ్’ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి మరి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసిన సినిమా ‘మెర్సి కిల్లింగ్’. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. తప్పకుండా ఒక మంచి చిత్రంగా ఈ సినిమా నిలబడుతుందని తెలిపారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని, అందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని.. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారని దర్శకుడు వెంకటరమణ ఎస్ (Soorapalli VenkatRamana) తెలిపారు. సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే సంతోషంగా ఉందని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఈ సినిమా విజయం సాధించి, టీమ్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ వంటి వారు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జి. అమర్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎల్.రాజా సంగీత బాధ్యతలను నిర్వర్తించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..
***********************
*Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ
***********************
*Kaliyugam Pattanamlo: షాక్.. ‘కలియుగం పట్టణంలో’ ఆపేశారు..
************************