SDT18: సాయి దుర్గ తేజ్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ అప్డేట్

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:16 PM

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘విరూపాక్ష’, ‘బ్రో’ విజయాల తర్వాత సాయి దుర్గ తేజ్.. రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

Sai Durgha Tej

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Mega Supreme Hero Sai Durgha Tej) స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘విరూపాక్ష’, ‘బ్రో’ విజయాల తర్వాత సాయి దుర్గ తేజ్.. రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత.. నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. (SDT18 Update)

Also Read- Tirupati Controversy: ల‌డ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

ఆ వివరాల్లోకి వెళితే.. SDT18 టీం ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫ్ చేసిన 15 రోజుల యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసింది. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో ఇందులో కనిపించనున్నారు. హై-ఆక్టేన్ స్టంట్స్, డైనమిక్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమాని తెరకెక్కుతోంది. నెక్స్ట్ షెడ్యూల్‌ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్‌ సిద్ధమవుతోందని.. హై స్కేల్, ఇంటెన్సిటీతో SDT18 గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.


ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా మూవీ విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

Read Latest Cinema News

Updated Date - Sep 20 , 2024 | 11:16 PM