Dakshina: సాయి ధన్సిక ‘దక్షిణ’ విడుదల తేదీ ఫిక్స్

ABN, Publish Date - Sep 20 , 2024 | 08:59 PM

‘మంత్ర, మంగళ’ సినిమాలతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ ‘దక్షిణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘దక్షిణ’ విడుదల ఎప్పుడంటే..

Sai Dhansika

‘మంత్ర, మంగళ’ సినిమాలతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ (Director Osho Tulasiram). కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ ‘దక్షిణ’ (Dakshina)మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక (Sai Dhansika) కథానాయికగా నటిస్తోంది. రిషబ్ బసు మరో ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Tirupati Controversy: ల‌డ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్


ఇటీవల ఈ సినిమాకు సంబంధించి వచ్చిన గ్లిమ్స్, ట్రైలర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్‌ను ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేసి.. ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘దక్షిణ’ సినిమాను అక్టోబర్ 4న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. థ్రిల్లింగ్ సినిమాలకు సరికొత్త నిర్వచనంగా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.


‘దక్షిణ’తో మళ్లీ ఓషో తులసిరామ్ టాలీవుడ్‌కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్‌ని ఇవ్వబోతున్నారని, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోందని, అక్టోబర్ 4న విడుదల కాబోతున్న దక్షణ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని, నైజాంలో ఈ సినిమాను మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని నిర్మాత అశోక్ షిండే తెలిపారు. సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ, ఆర్నా ములెర్, మేఘన చౌదరి, నవీన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి బాలాజీ సంగీతం అందించారు.

Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

Read Latest Cinema News

Updated Date - Sep 20 , 2024 | 08:59 PM