రూ. పదికోట్ల వీడియో ఫ్రీగా చూడండి
ABN, Publish Date - Nov 18 , 2024 | 04:12 AM
నటి నయనతార బయోపిక్‌గా నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ద ఫేరీ టేల్’. దీనికోసం ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా సమయంలో షూట్ చేసిన మూడు సెకన్ల క్లిప్‌ను వాడుకున్నందుకు రూ.పది కోట్లు ఇవ్వాలని నటుడు, నిర్మాత ధనుష్ కోరారని...
నటి నయనతార బయోపిక్‌గా నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ద ఫేరీ టేల్’. దీనికోసం ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా సమయంలో షూట్ చేసిన మూడు సెకన్ల క్లిప్‌ను వాడుకున్నందుకు రూ.పది కోట్లు ఇవ్వాలని నటుడు, నిర్మాత ధనుష్ కోరారని.. ఇందుకు ఆయనని విమర్శిస్తూ నయనతార ఓ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే నయనతారను సపోర్ట్ చేస్తూ ఆదివారం ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెండు పోస్టులు పెట్టారు. అందులో ఒక దాంట్లో..‘‘కేవలం మూడు సెకన్లకు ధనుశ్ రూ.పది కోట్లు డిమాండ్ చేసిన వీడియో ఇదే. మీరంతా ఫ్రీగా చూసేయ్యండి’’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అంతటితో ఆగకుండా... మరో పోస్ట్‌లో.. 2017లో ‘సక్క పొడు పొడు రాజా’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో ధనుశ్ మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. అందులో ప్రేమను పంచడం గురించి.. నటీనటులు పనిచేసే చోట ఉండాల్సిన వాతావరణం గురించి ధనుశ్ మాట్లాడారు.
ఆ వీడియోకి కౌంటర్‌గా ‘‘జీవించండి.. ఇతరులని స్వేచ్చగా జీవించనివ్వండి. ప్రేమను పంచండి.. ఓం నమః శివాయ. మీరు చెప్పినవి ముందు మీరు పాటించండి. కనీసం మీ అభిమానుల కోసమైనా’’ అని పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులను కొద్దిసేపటికే విఘ్నేష్ శివన్ తొలగించడం గమనార్హం. మరోవైపు గాయని సుచిత్ర, ధనుశ్ ఎంతో మంది హీరోయిన్లను వేధించారని ఆరోపించారు.