మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Roti Kapada Romance : యూత్‌ను ఆకట్టుకుంటుంది

ABN, Publish Date - Mar 10 , 2024 | 06:34 AM

యూత్‌ ఫుల్‌ చిత్రాలను నిర్మించే బెక్కెం వేణుగోపాల్‌.. సృజన్‌ కుమార్‌ బొజ్జంతో కలసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. హర్ష నర్రా, సందీప్‌, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు...

యూత్‌ ఫుల్‌ చిత్రాలను నిర్మించే బెక్కెం వేణుగోపాల్‌.. సృజన్‌ కుమార్‌ బొజ్జంతో కలసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. హర్ష నర్రా, సందీప్‌, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. విక్రమ్‌ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్‌ 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే సినిమాలా అనిపిస్తోంది’’ అని అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘‘కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమా ఇది’’ అని అన్నారు. మరో నిర్మాత సృజన్‌ కుమార్‌ బొజ్జం మాట్లాడుతూ ‘‘కథను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా చేసిన సినిమా ఇది’’ అని అన్నారు. దర్శకుడు విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘కొత్త వాళ్లతో ఇలాంటి సినిమా తీయడం ఓ మిరాకిల్‌. మాకు ఈ టైటిల్‌ ఇచ్చి ఎంకరేజ్‌ చేస్తున్న నిర్మాత దిల్‌ రాజుకు రుణపడి వుంటాం’’ అని అన్నారు.

Updated Date - Mar 10 , 2024 | 06:34 AM