రోషన్‌ హీరోగా ‘ఛాంపియన్‌’

ABN, Publish Date - Aug 18 , 2024 | 01:32 AM

నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించే కొత్త చిత్రం ‘ఛాంపియన్‌’ షూటింగ్‌ శనివారం మొదలైంది. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు..

నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించే కొత్త చిత్రం ‘ఛాంపియన్‌’ షూటింగ్‌ శనివారం మొదలైంది. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రా్‌పలో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్‌ ను దర్శకుడు నాగ్‌అశ్విన్‌ తొలి క్లాప్‌ ఇచ్చి ప్రారంభించారు. సరికొత్త పాత్రలో రోషన్‌ను ప్రజెంట్‌ చేయడానికి ఓ విభిన్నమైన స్ర్కిప్ట్‌ను దర్శకుడు ప్రదీప్‌ సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కళా దర్శకుడు! తోట తరణి, నిర్మాణం: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌.

Updated Date - Aug 18 , 2024 | 01:32 AM