రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌

ABN, Publish Date - Dec 20 , 2024 | 02:09 AM

‘క’తో హిట్‌ కొట్టిన కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్‌రూబా’. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికగా విశ్వ కరుణ్‌ దర్శకత్వంలో రవి, జోజో జోస్‌, రాకేశ్‌ రెడ్డి, సారెగమ నిర్మిస్తున్నారు...

‘క’తో హిట్‌ కొట్టిన కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్‌రూబా’. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికగా విశ్వ కరుణ్‌ దర్శకత్వంలో రవి, జోజో జోస్‌, రాకేశ్‌ రెడ్డి, సారెగమ నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసి.. ‘హిస్‌ లవ్‌.. హిస్‌ యాంగర్‌’ అని పేర్కొన్నారు. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ప్రవీణ్‌.కె.ఎల్‌, సినిమాటోగ్రఫీ: డానియల్‌ విశ్వాస్‌, సంగీతం: సామ్‌.సీ.ఎస్‌.

Updated Date - Dec 20 , 2024 | 02:09 AM