అద్భుతమైన కంటెంట్‌తో ‘రేవు’
ABN, Publish Date - Aug 22 , 2024 | 12:04 AM
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకత్వంలో డా.మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మించారు. సీనియర్ జర్నలిస్టులు ప్రభు
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకత్వంలో డా.మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మించారు. సీనియర్ జర్నలిస్టులు ప్రభు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టగా, పి.రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరినాథ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. అందరూ మెచ్చే చిత్రమిది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎగ్టైట్ అవుతారు’’ అని నిర్మాత డా.మురళి గింజుపల్లి అన్నారు.