‘మిస్టర్ బచ్చన్’ను గుర్తుంచుకుంటారు
ABN, Publish Date - Aug 14 , 2024 | 03:07 AM
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో టీ.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు..
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో టీ.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో మీరు కొత్త రవితేజను చూస్తారు. ఇందులోని ప్రేమకథ, పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా థియేటర్లలో ఇరగదీస్తుంది. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకుంటారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇది థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించే సినిమా. అనుకున్నదానికంటే బాగా వచ్చింది. దానిక్కారణం ఆయనంక బోస్ విజువల్స్, మిక్కీ.జే.మేయర్ సంగీతం. ఈ సినిమాకు రిపీట్ ఆడియెన్స్ ఉంటారు’’ అని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. ‘‘ఇది రవితేజతో నా మూడో సినిమా. ఈ సినిమాలో ప్రేక్షకులని ఆశ్చర్యపరిచే అంశాలు చాలా ఉన్నాయి. ఈ మాస్ ఎంటర్టైనర్ అందరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ తెలిపారు.