విడుదల తేదీ ఖరారు

ABN, Publish Date - Dec 16 , 2024 | 05:10 AM

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి నటిస్తున్న 50వ చిత్రం ‘ఘాటి’. రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్‌ను...

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి నటిస్తున్న 50వ చిత్రం ‘ఘాటి’. రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. ఆదివారం ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న విడుదలవుతున్నట్లు ఓ పోస్టర్‌ విడుదల చేశారు. ఇందులో అనుష్క లుక్‌ను ప్రజంట్‌ చేస్తూ.. ‘విక్టిమ్‌.. క్రిమినల్‌.. లెజెండ్‌’ అని పేర్కొన్నారు. అనుకోని పరిస్థితుల్లో లోతైన సమస్యలో కూరుకుపోయిన ఓ మహిళ.. తనకు జరిగిన అన్యాయంపై పోరాడి ..వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా, క్రిష్‌ దర్శకత్వంలో దాదాపు 14 ఏళ్ల తర్వాత అనుష్క నటిస్తుండటం విశేషం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలతో పాటు క్లాసికల్‌ హిట్‌ స్టేట్‌సను సంపాదించుకుంది.

Updated Date - Dec 16 , 2024 | 05:10 AM