రివాల్వర్‌తో రెడీ

ABN, Publish Date - Nov 06 , 2024 | 03:18 AM

కీర్తిసురేశ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘రివాల్వర్‌ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనిస్వామి నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల..

కీర్తిసురేశ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘రివాల్వర్‌ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనిస్వామి నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. చేతిలో రివాల్వర్‌ పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న లుక్‌లో కీర్తిసురేశ్‌ కనిపించారు. నిర్మాత రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రాధికా శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సీన్‌ రోల్డాన్‌.

Updated Date - Nov 06 , 2024 | 03:18 AM