మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ravikula Raghurama: ‘రవికుల రఘురామ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:43 PM

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో, డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

Ravikula Raghurama Movie Still

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో, డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి.. ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. (Ravikula Raghurama Release Date)


ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత శ్రీధర్ వర్మ ఈ సినిమాను పాజిటీవ్ వైబ్స్ ప్రొడక్షన్స్‌లో నిర్మించారని.. యూత్ కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని.. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా సినిమాను తెరకెక్కించామని తెలిపారు దర్శకుడు చంద్రశేఖర్ కానూరి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందించారని.. ఈ చిత్రానికి సంగీతం ఒక సోల్‌గా ఉంటుందని ఆయన తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 10:43 PM