Ravikula Raghurama: పరశురామ్ వదిలిన ‘చందమామే’
ABN, Publish Date - Feb 16 , 2024 | 02:52 PM
పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత శ్రీధర్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘చందమామే’ అంటూ సాగే లిరికల్ వీడియోను క్రేజీ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత శ్రీధర్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి (Chandrashekhar Kanuri) దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమ్ సాగి, దీప్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథను అందంగా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘చందమామే’ (Chandhamame Song) అంటూ సాగే లిరికల్ వీడియోను క్రేజీ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
పాట విడుదల అనంతరం పరశురామ్ (Parasuram) మాట్లాడుతూ.. చందమామే సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా, వినసొంపుగా ఉన్నాయి. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సాంగ్ ఆకట్టుకోవడంతో ‘రవికుల రఘురామ’ చిత్ర రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. మా సినిమా పాటను విడుదల చేసిన దర్శకుడు పరశురామ్‌కు ధన్యవాదాలు. ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం. సుకుమార్ పమ్మి ఈ చిత్రానికి అద్భుతమైన పాటలను సిద్ధం చేశారు. సంగీతం ఈ సినిమాకు ఒక సోల్‌గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథతో రెడీ అవుతోన్న ‘రవికుల రఘురామ’కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
====================
*Vijay Deverakonda: ఫోర్బ్స్ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..
****************************
*Chiranjeevi: ‘సుందరం మాస్టర్’కు మెగాస్టార్ సపోర్ట్.. ఏం చేశారంటే?
***************************
*‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?
***********************