మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rao Ramesh: బర్త్‌డే స్పెషల్‌.. ‘పుష్ప 2’ సిండికేట్ సిద్ధప్ప లుక్ విడుదల

ABN, Publish Date - May 25 , 2024 | 04:05 PM

రావు రమేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘పుష్ప 2’ నుంచి విడుదల చేసిన ఈ పోస్టర్‌లో సిండికేట్ సిద్ధప్పగా రావు రమేష్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక మనుషులు, వర్షం.. ఇవన్నీ కూడా పోస్టర్‌లోని సిద్ధప్పను హైలెట్ చేస్తున్నాయి. ‘పుష్ప’ పార్ట్ 1లో రావు రమేష్‌కు పెద్దగా నిడివి దక్కలేదు. కానీ పార్ట్ 2లో మాత్రం ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.

Rao Ramesh in Pushpa 2 The Rule Movie

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌-2 ది రూల్’ (Pushpa 2 The Rule). ‘పుష్ప ది రైజ్‌’తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Director Sukumar) ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంతా ఫిదా అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న ‘పుష్ప‌-2 ది రూల్‌’పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు వున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే.. ఈ సినిమా నుంచి విడుదలవుతోన్న ఒక్కో అప్డేట్ వైరల్ అవుతూ వస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన టీజర్, అంతకు ముందు వదిలిన గ్లింప్స్, రష్మిక లుక్, పుష్ప పుష్ప సాంగ్ ఇవన్నీ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా చేయగా.. ఇప్పుడీ సినిమాలో కీలక పాత్రధారి అయిన విలక్షణ నటుడు రావు రమేష్ (Rao Ramesh) పాత్రని రివీల్ చేశారు మేకర్స్.

*Anasuya: విహారయాత్రలో ఫ్యామిలీతో ఛిల్ అవుతోన్న అనసూయ ఫొటోలు


రావు రమేష్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో సిండికేట్ సిద్ధప్ప (Siddappa)గా రావు రమేష్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక మనుషులు, వర్షం.. ఇవన్నీ కూడా పోస్టర్‌లోని సిద్ధప్పను హైలెట్ చేస్తున్నాయి. ‘పుష్ప’ పార్ట్ 1లో రావు రమేష్‌కు పెద్దగా నిడివి దక్కలేదు. కానీ పార్ట్ 2లో మాత్రం ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. పుష్ప, సిద్ధప్ప మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకోనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. మరి అవి ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయక తప్పదు. (Happy Birthday Rao Ramesh)


అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచి.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా ‘పుష్ప’ నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2 ది రూల్’ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్‌గా 15 ఆగస్ట్ 2024న (Pushpa 2 Release Date) వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. (Pushpa 2 The Rule Siddappa Look Out)

Read Latest Cinema News

Updated Date - May 25 , 2024 | 04:05 PM