రామ టాకీస్‌ ర్యాంప్‌ సాంగ్‌

ABN, Publish Date - Nov 07 , 2024 | 04:16 AM

కరుణ కుమార్‌ దర్శకత్వంలో విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన సినిమా ‘మట్కా’. వరుణ్‌ తేజ్‌ , మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈనెల 14 గ్రాండ్‌ రిలీజ్‌కి...

కరుణ కుమార్‌ దర్శకత్వంలో విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన సినిమా ‘మట్కా’. వరుణ్‌ తేజ్‌ , మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈనెల 14 గ్రాండ్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రామ టాకీస్‌ ర్యాంప్‌ సాంగ్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భవానీ రాకేశ్‌ అదిరిపోయే బీట్స్‌తో అడిక్టివ్‌ ఫోక్‌ నంబర్‌గా ఈ పాటని కంపోజ్‌ చేశారు. డైరెక్టర్‌ కరుణ కుమార్‌ స్వయంగా రాసిన జానపద సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌, కిశోర్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Updated Date - Nov 07 , 2024 | 04:16 AM