మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Double Ismart: రామ్ పుట్టినరోజు స్పెషల్ గా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల

ABN, Publish Date - May 15 , 2024 | 10:42 AM

'లైగర్' అపజయం నుండి ఇంకా దర్శకుడు పూరి జగన్ పూర్తిగా కోలుకోలేదు అనిపిస్తోంది ఈ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ చూస్తుంటే. రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ అంత ఆసక్తికరంగా లేదు, కొత్తదనం కూడా ఇందులో ఏమీ కనిపించలేదు అని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి...

Double Ismart teaser is released on the occasion of Ram Pothineni BIrthday

పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమాపై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలు లేవు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఇంతకు ముందు విజయ్ దేవరకొండ తో తీసిన 'లైగర్' పెద్ద డిజాస్టర్ కావటమే. దానికితోడు ఈ 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఈపాటికి విడుదలవ్వాల్సి ఉండగా అసలు ఇంతవరకు చిత్రీకరణ కూడా పూర్తి చేసుకోలేదు. పూరి జగన్ ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డారు, అందుకే ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది అని ఆమధ్య చాల వార్తలు హల్ చల్ చేశాయి కూడా. (Double iSmart teaser is out now)

ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ 'డబుల్ ఇస్మార్ట్' సినిమా నుండి ఓక టీజర్ ని విడుదల చేశారు. అయితే ఈ టీజర్ లో ఎటువంటి పస లేదు, రెండు మూడు మాస్ డైలాగులు ముందు సినిమాలో ఉన్నట్టుగానే వున్నాయి, తప్పితే, కొత్తగా ఏమీ లేదు అని అర్థం అయిపోతోంది. ఎదో రామ్ పుట్టినరోజునాడు ఒక టీజర్ విడుదల చెయ్యాలి కాబట్టి చేశారు అన్నట్టుగా విడుదల చేశారు, తప్పితే టీజర్ లో ఈ సినిమాలో ఎటువంటి విషయం వుంది అనేది చెప్పలేదు. (On the occasion of Ram Pothineni birthday, teaser from his film 'Double iSmart' is out)

టీజర్ చూస్తుంటే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో వున్న మాటలు తప్పితే ఇందులో కొత్తగా ఏమీ లేవు. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు, అంతే. ఇంతకు ముందు 'లైగర్' సినిమా అపజయంతో వివాదంలో పడిన పూరి జగన్ ఇప్పుడు ఈ సినిమాతో కోలుకుంటారా అన్న ప్రశ్న ఒకటి నడుస్తోంది. అలాగే 'లైగర్' సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు, మరి ఇప్పుడు ఈ సినిమా సజావుగా విడుదలవుతుందా అని ఇంకో చర్చ కూడా పరిశ్రమలో నడుస్తోంది. (Double iSmart teaser is not impressive as it looks like the same formula of the first one iSmart Shankar)

ఏదిఏమైనా పూరి జగన్ తాజా సినిమా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ అయితే మాత్రం అంత ఆసక్తికరంగా లేదనే చెప్పాలి అని అంటున్నారు. రామ్ పోతినేని పాత్ర మొదటి సినిమాలో ఉన్నట్టుగానే వుంది, అంతే, కావ్య థాపర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.

Updated Date - May 15 , 2024 | 12:29 PM