Ram Charan: వారసత్వం గురించి చరణ్ ఏమన్నారంటే!
ABN, Publish Date - Jun 17 , 2024 | 05:19 PM
రామ్చరణ్ (Ram charan)షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ.. తన గారాల బిడ్డ క్లీంకార తో (klinkara) సరదాగా గడుపుతున్నారు. ఆమె కోసం ఎక్కువ సమయం కేటాయించడానికి ప్లాన్ చేస్తున్నారు.
రామ్చరణ్ (Ram charan)షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ.. తన గారాల బిడ్డ క్లీంకార తో (klinkara) సరదాగా గడుపుతున్నారు. ఆమె కోసం ఎక్కువ సమయం కేటాయించడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఒత్తిడికి గురవుతారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు.
‘ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందనప్పుడు కూడా నేను రిలాక్స్ కావడం కోసం పార్టీ చేసుకుంటాను. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్బస్టర్ హిట్ అయిన తర్వాత వారం రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదు. కుటుంబంతో ఎంజాయ్ చేశాను. వారసత్వం గురించి ఎక్కువగా ఆలోచించను. ప్రస్తుతం ఏం జరుగుతుందో దానిపైనే దృష్టి పెడతాను. అదే నాకు ముఖ్యం. ఒక తండ్రిగా, కుమారుడిగా, సోదరుడిగా ఈరోజు నా బాధ్యతలను పూర్తిగా న్యాయం చేయగలిగానా, లేదా అన్నదే ఆలోచిస్తాను. అదే ముఖ్యం కూడా! ప్రతిరోజు ఇలాగే ఆలోచిస్తాను’ అని అన్నారు.
ప్రస్తుతం రామ్చరణ్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో ఓ చిత్రం చేయనున్నారు.