మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ram Pothineni: ట్రెండింగ్ లో రామ్, పూరి జగన్ ల 'డబుల్ ఇస్మార్ట్' టీజర్

ABN, Publish Date - May 15 , 2024 | 12:50 PM

రామ్ పోతినేని, పూరి జగన్ కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఈరోజు విడుదలైంది. ఒక్క తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది

Ram Pothineni in Double Ismart

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 2019లో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా పెద్ద విజయం సాధించింది. అటు రామ్ కీ, ఇటు పూరి జగన్ కి ఆ సినిమా ఒక పెద్ద బ్రేక్ ఇవ్వటమే కాకుండా, ఎన్నాళ్ళ నుండో విజయం కోసం ఎదురు చూస్తున్న పూరి జగన్ ఆ సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చారు. ఆ సినిమాలో రామ్ తెలంగాణ యాస మాట్లాడి ఒక మాస్ పాత్రలో ప్రేక్షకులని ఎంతగానే ఆకట్టుకున్నారు. పూరి జగన్ ఆ సినిమాలో రామ్ కి ఎంత హైప్ ఇవ్వాలో అంత ఇచ్చి, రామ్ కెరీర్ లో 'ఇస్మార్ట్ శంకర్' ఒక మరపురాని చిత్రంగా మలిచారు. (Double iSmart teaser is now trending on Social Media)

మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' అని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు చిత్రీకరణ దశలో వుంది, ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా నుండి ఒక టీజర్ ను విడుదల చేశారు. రామ్ కి ఈ 'డబుల్ ఇస్మార్ట్' మళ్ళీ ఒక మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే 'ఇస్మార్ట్ శంకర్' తరువాత రామ్ సినిమాలు అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఇప్పుడు ఈ 'డబుల్ ఇస్మార్ట్' పైనే ఆశలు పెట్టుకున్నారు. (Teaser from Double iSmart is out now on the occasion of Ram Pothineni Birthday)

ఇంకో పక్క దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో మళ్ళీ విజయం సాధించాలని చూస్తున్నారు. అందుకనే ఈ సినిమాపై దృష్టి పెట్టి ఎలా అయినా మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమానుండి విడుదలైన టీజర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదలైంది. బాలీవుడ్ కి చెందిన సంజయ్ దత్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తుండగా, కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. (Bollywood actor Sanjay Dutt is playing villain in Double iSmart)

Updated Date - May 15 , 2024 | 12:56 PM