‘రాఖీ’ స్పెషల్‌

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:47 AM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ అందరికీ ప్రత్యేకమయితే.. సినిమా తారలకి మరింత ప్రత్యేకం. ఈ ఏడాది కొందరు తారలు వారి సోదరులతో తీసుకున్న ఫొటోలను.. మరి కొందరు...

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ అందరికీ ప్రత్యేకమయితే.. సినిమా తారలకి మరింత ప్రత్యేకం. ఈ ఏడాది కొందరు తారలు వారి సోదరులతో తీసుకున్న ఫొటోలను.. మరి కొందరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ త్రోబ్యాక్‌ పిక్స్‌ను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ‘బ్రదర్‌ సిస్టర్‌ బాండింగ్‌’ అంటే ఇదేనంటూ తెగ మురిసిపోతున్నారు.

అందరికీ పేరుపేరునా..

‘‘అందరికీ పేరుపేరునా ‘రాఖీ పౌర్ణమి’ శుభాకాంక్షలు’’ అని హీరో వరుణ్‌ తేజ్‌ తన సోదరీమణులు నిహారిక, సుష్మితతో కలసి తీసుకున్న ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

నా మార్గదర్శకురాలికి..

అక్కా.. ‘రాఖీ పౌర్ణమి’ శుభాకాంక్షలు. నా మార్గదర్శకురాలిగా.. సపోర్ట్‌ సిస్టమ్‌గా ఉన్నందుకు కృతజ్ఞతలు’’ అని హీరో సుధీర్‌బాబు తన సోదరితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.


‘హ్యాపీ రక్షా బంధన్‌’

‘‘నా ప్రియ సోదరి మౌని కుట్టీకి.. నన్ను సొంత తోబుట్టువులా భావించే అభిమానులందరికీ ‘హ్యాపీ రక్షా బంధన్‌’ అని హీరో సందీప్‌ కిషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘ఒకరినొకరు ఎల్లప్పుడూ ఇలాగే కాపాడుకుంటూ ఉండాలి’’ అంటూ తన సోదరుడికి రాఖీని కడుతూ నభా నటేశ్‌ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

ఇష్టమైన సమయం వచ్చేసింది

‘‘ప్రతీ ఏడాది.. ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. మరెంతో ఇష్టం. ఎందుకంటే ఈ రోజు నువ్వు నా కోసం నచ్చిన బహుమతులు తెస్తావు.. నన్ను కాపాడుతానని ప్రేమతో వాగ్ధానాలు చేస్తావు.. నేను చెప్పే ప్రతీది వింటావు’’ అని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన సోదరుడు అమన్‌ప్రీత్‌ సింగ్‌కు రాఖీ కడుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.


థ్యాంక్యూ అన్నయ్యా..

‘‘థాంక్యూ అన్నయ్యా.. నా బిగ్‌ బ్రదర్‌గా ఉన్నందుకు’’ అని మహేశ్‌బాబు కుమార్తె సితార ఘట్టమనేని, తన సోదరుడు గౌతమ్‌తో దిగిన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

నిన్ను బాగా మిస్సవుతున్నాను

‘‘నా బెస్ట్‌ బ్రదర్‌కి ‘హ్యాపీ రక్షా బంధన్‌’. మనం చిన్నప్పుడు కలసి చేసిన అల్లరినీ.. నిన్నూ ఎంతో మిస్సవుతున్నాను. త్వరలోనే కలుద్దాం’’ అని హీరోయిన్‌ తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు.

వీరితో పాటు అక్షయ్‌కుమార్‌, సంజయ్‌దత్‌, సోనూసూద్‌, సన్నీ డియోల్‌, కంగనా రనౌత్‌, పరిణితీ చోప్రా, భూమి పడ్నేకర్‌, మనీషా కోయిరాల, రియా చక్రవర్తి, హ్యూమా ఖురేషీ, సారాఅలీ ఖాన్‌, జెనీలియా దేశ్‌ముఖ్‌, సోనమ్‌ కపూర్‌, కూడా రాఖీ పౌర్ణిమను సెలబ్రేట్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

Updated Date - Aug 20 , 2024 | 02:47 AM