కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Naga Chaitanya : ఇక రాజులమ్మ జాతరే

ABN, Publish Date - Jan 07 , 2024 | 03:00 AM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తండేల్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ‘తండేల్‌’ కథను క్లుప్తంగా పరిచయం చేస్తూ శనివారం చిత్రబృందం ప్రత్యేక వీడియోను...

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తండేల్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ‘తండేల్‌’ కథను క్లుప్తంగా పరిచయం చేస్తూ శనివారం చిత్రబృందం ప్రత్యేక వీడియోను వదిలింది. మత్స్యకార పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు. ‘ఈ పాలి యేట...గురి తప్పేదేలేదేస్‌... ఇక రాజులమ్మ జాతరే’ అంటూ ఆయన శ్రీకాకుళం యాసలో పలికిన మాస్‌ డైలాగ్‌ తో వీడియో మొదలైంది. చేపలు పడుతూ పాకిస్థాన్‌ జలాల్లోకి ప్రవేశించడం, అక్కడి సైన్యం వారిని కరాచీ సెంట్రల్‌ జైలులో ఖైదు చేసి చిత్రహింసలు పెట్టడం సినిమాపై ఆసక్తిని పెంచాయి. నాగచైతన్య ప్రేయసి బుజ్జి తల్లిగా సాయిపల్లవి కనిపించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 03:00 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!