Coolie: రజినీ కోసం మరో 'లెజెండ్'.. అక్కడ సునామే

ABN, Publish Date - Oct 14 , 2024 | 10:53 AM

ఈ సినిమాలో తెలుగు నుండి కింగ్ నాగార్జున, మలయాళం నుండి సౌబిన్‌ షాహిర్‌, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు తమిళ్ యంగ్ హీరో శివ కార్తికేయ నటిస్తుండగా మరో లెజెండ్ యాక్టర్ ఈ సినిమాలో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఈ కాంబో వర్కౌట్ అయితే పాన్ ఇండియా వైడ్‌గా కూలీ సృష్టించే సునామీకి అంతుండదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..

Coolie

'ఖైదీ', 'విక్రమ్‌' చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanakaraj). ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’ (Coolie). సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తెలుగు నుండి కింగ్ నాగార్జున, మలయాళం నుండి సౌబిన్‌ షాహిర్‌, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు తమిళ్ యంగ్ హీరో శివ కార్తికేయ నటిస్తుండగా మరో లెజెండ్ యాక్టర్ ఈ సినిమాలో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..


లోకేష్ కనగరాజ్ 'ఖైదీ, లియో, విక్రమ్‌' సినిమాలతో కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'కూలీ' సినిమా క్యాస్ట్ ప్రకటించి నేషనల్ వైడ్‌గా బజ్ క్రియేట్ చేశాడు. సౌతిండియా నుండి అన్ని భాషల స్టార్లను క్యాస్ట్ చేసిన కనగరాజ్ సినిమాకి అనిరుధ్ సంగీతం అడిషనల్ ఎసెట్. అయితే లోకేష్ సినిమాలకి సౌత్‌లో మంచి మార్కెట్ ఉన్న హిందీలో ప్రాపర్ మార్కెట్ లేదు. ఈ క్రమంలోనే ఆయన ఒక పాపులర్ హిందీ ఐకానిక్ స్టార్‌ని మూవీలో తీసుకోనున్నట్లు సమాచారం. అయితే రజినీకి సన్నిహితుడైన, అభిమాన హిందీ స్టార్ 'అమీర్ ఖాన్' ని ఈ రోల్‌కి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబో వర్కౌట్ అయితే పాన్ ఇండియా వైడ్‌గా కూలీ సృష్టించే సునామీకి అంతుండదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ప్రస్తుతం అమీర్ ఆయన ఐకానిక్ ఫిల్మ్ 'తారే జమీన్ పర్' సీక్వెల్‌గా 'సితారే జమీన్ పర్' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అమీర్ జెనీలియాతో నటిస్తుండటంతో పాటు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ స్పానిష్ సినిమా 'ఛాంపియన్స్' కి రీమేక్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది.

Updated Date - Oct 14 , 2024 | 10:53 AM