కోలుకున్న రజనీకాంత్‌

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:17 AM

మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పూర్తిగా కోలుకున్నారని, ఆయన శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యే...

  • నేడు డిశ్చార్జ్‌!

మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పూర్తిగా కోలుకున్నారని, ఆయన శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యే అవకాశముందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. గత సోమవారం రాత్రి ఉన్నట్టుండి అస్వస్థతకు లోనైన రజనీకాంత్‌ను ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెల్సిందే. ఆయన పూర్తిగా కోలుకున్నారని, ఉదయం పూట పత్రికలను చదువుతూ, టీవీ చూస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Oct 04 , 2024 | 01:18 AM