వింటేజ్‌ లుక్‌లో రాజాసాబ్‌

ABN, Publish Date - Oct 24 , 2024 | 05:40 AM

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘రాజా సాబ్‌’ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనరుపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ ఇప్పటివరకూ చేయని రొమాంటిక్‌ హారర్‌ జానర్‌లో ఈ సినిమాను దర్శకుడు మారుతి...

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘రాజా సాబ్‌’ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనరుపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ ఇప్పటివరకూ చేయని రొమాంటిక్‌ హారర్‌ జానర్‌లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘రాజా సాబ్‌ ’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రాజా సాబ్‌గా ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌ అదిరిపోయింది. ‘హారర్‌ ఈజ్‌ ద న్యూ హ్యూమర్‌’ అనే కాప్షన్‌ మోషన్‌ పోస్టర్‌ చివరిలో వేయడం ద్వారా ఒక కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసే హారర్‌ ప్లస్‌ కామెడీ చిత్రమిది మేకర్స్‌ తెలియజేశారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 10న ‘రాజా సాబ్‌’ విడుదల కానుంది.

Updated Date - Oct 24 , 2024 | 05:40 AM