Tiragabadara Saami: రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’కి రిలీజ్ డేట్ ఫిక్సయింది..

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:31 PM

రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా హీరోయిన్‌గా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Tiragabadara Saami Still

రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి (AS Ravikumar Chowdary) దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’ (Tiragabadara Saami). మాల్వి మల్హోత్రా (Malvi Malhotra) హీరోయిన్‌గా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌ని ఆకట్టుకునే రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్‌ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు.

‘తిరగబడరసామీ’ సినిమాను ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ప్రస్తుతం రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల రియల్ లైఫ్ స్టోరీ ఓ ముక్కోణపు థ్రిల్లింగ్ లవ్ స్టోరీని తలపిస్తుండటం కూడా ఈ సినిమాకు హైప్‌కు కారణమవుతోంది. ఏదయితేనేం.. రాజ్ తరుణ్ రియల్ లైఫ్ ఇష్యూతో.. ఈ సినిమా కూడా బాగా వార్తలలో నిలుస్తుండగం గమనార్హం. (Tiragabadara Saami Release Date)


ఈ సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించడంతో పాటు ఒక స్పెషల్ సాంగ్‌లో అలరించబోతుంది. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జెబి మరియు భోలే షావలి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jul 11 , 2024 | 10:31 PM

Tiragabadara Saami Teaser: జై బాలయ్య.. బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే..

Tiragabadara Saami: చాలా బాగుందే.. లిరికల్ సాంగ్

Tiragabadara Saami: ‘తిరగబడరసామీ’ మూవీ టీజర్

Tiragabadara Saami: ‘తిరగబడరసామీ’ మూవీ ట్రైలర్

Tiragabadara Saami: ‘తిరగబడరసామీ’లోని రాధాభాయ్ లిరికల్ సాంగ్