‘గాంధీ’ కోసం రెహమాన్‌ సంగీతం

ABN, Publish Date - Oct 03 , 2024 | 02:48 AM

బాలీవుడ్‌ డైరెక్టర్‌ హన్షల్‌ మెహతా దర్శకత్వంలో మహాత్ముడి జీవితం ఆధారంగా ‘గాంధీ’ సిరీస్‌ తెరకెక్కుతోంది. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను...

బాలీవుడ్‌ డైరెక్టర్‌ హన్షల్‌ మెహతా దర్శకత్వంలో మహాత్ముడి జీవితం ఆధారంగా ‘గాంధీ’ సిరీస్‌ తెరకెక్కుతోంది. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను చిత్రబృందం షేర్‌ చేసుకుంది. ఈ సినిమాకు ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారని ప్రకటించింది. ఈ సందర్భంగా రెహమాన్‌ మాట్లాడుతూ ‘దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ జీవిత కథను ఈ సిరీస్‌ స్ఫూర్తిదాయక రీతిలో ప్రజెంట్‌ చేస్తుంది. అటువంటి గొప్ప పోరాట యోధుడి బయోపిక్‌కు సంగీతం అందించటం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రన్‌ గుహ రాసిన ‘గాంధీ బిఫోర్‌ ఇండియా’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది. అప్లాజ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది.

Updated Date - Oct 03 , 2024 | 02:48 AM