రెహమాన్ నాకు తండ్రితో సమానం
ABN, Publish Date - Nov 27 , 2024 | 06:18 AM
రెహమాన్ దంపతుల విడాకుల ప్రకటనకూ.. తనకూ సంబంధం ఉందని వస్తున్న వార్తలపై గిటారిస్ట్ మోహిని దే మరోసారి వివరణచ్చారు. ఈ మేరకు ఓ వీడయో విడుదల చేశారు. ‘‘నాది, రెహమాన్ కూతురుది ఒకే వయసు...
రెహమాన్ దంపతుల విడాకుల ప్రకటనకూ.. తనకూ సంబంధం ఉందని వస్తున్న వార్తలపై గిటారిస్ట్ మోహిని దే మరోసారి వివరణచ్చారు. ఈ మేరకు ఓ వీడయో విడుదల చేశారు. ‘‘నాది, రెహమాన్ కూతురుది ఒకే వయసు. ఆయనతో ఎనిమిదిన్నర ఏళ్లుగా కలసి పనిచేస్తున్నాను. ఎన్నో సినిమాలకు మ్యూజిక్ చేశాను. స్టేజ్ షోలలో పాల్గొన్నాను. ఆయన నాకు తండ్రితో సమానం. రెహమాన్ ఒక లెజెండ్. నా జీవితానికి రోల్ మోడల్. ఆయన నన్ను తన కూతురిలాగే చూసేవారు. ఆయనంటే ఎంతో గౌరవం ఉంది. అలాంటి మాపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఇలాంటి సున్నితమైన అంశాల్లో నిందలు వేయడం సరికాదు. అసభ్యకరంగా మాట్లాడటం నేరంగా పరిగణించాలి. నేను ఈ ఆరోపణలన్నింటికీ వివరణ ఇచ్చుకోవాల్సిన పనిలేదు. అలాగే, ఈ వదంతులు నా ప్రశాంతతను పాడు చేయాలనుకోవట్లేదు. దయచేసి ఇకనైనా వీటికి ఫుల్ స్టాప్ పెట్టండి. మా గోప్యతను గౌరవించండి’’ అని కోరారు.
ఆ ప్రచారం ఆపండి
ఏ.ఆర్.రెహమాన్ సతీమణి సైరా బాను తమ విడాకుల ప్రకటన పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. ‘‘అనారోగ్య సమస్యలతోనే నేను ముంబైకి మకాం మార్చాను. ఏ.ఆర్.రెహమాన్ తీరికలేని షెడ్యూల్స్ వల్ల ఆయన చెన్నైలోనే ఉండాలి. కాబట్టి నేను ఒక్కదాన్నే ముంబైకి రావాల్సి వచ్చింది. మేం అధికారికంగా ఇప్పటివరకూ ఏ విషయాన్నీ ప్రకటించలేదు. ఆయన ఉన్నతమైన వ్యక్తి. దయచేసి ఆయన ప్రతిష్ఠకు భంగం కల్పించే తప్పుడు ప్రచారాలు మానండి’’ అని కోరారు.