RL25: ‘ఖిలాడి’ దర్శకుడితో రాఘవ లారెన్స్..

ABN, Publish Date - Sep 14 , 2024 | 09:29 PM

నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ‘రాక్షసుడు, ఖిలాడీ’ వంటి సినిమాల తర్వాత చేస్తున్న సినిమా అప్డేట్ వచ్చేసింది. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ వివరాలివే..

Raghava Lawrence and Ramesh Varma

నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) నిర్మాతగా ‘రాక్షసుడు, ఖిలాడీ’ వంటి సినిమాల తర్వాత చేస్తున్న సినిమా అప్డేట్ వచ్చేసింది. ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కోనేరు సత్యనారాయణ.. ఇప్పుడు నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. తమ సంస్థలో ఇంతకు ముందు వచ్చిన ‘రాక్షసుడు, ఖిలాడి’ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రమేష్‌వర్మతోనే మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారు కోనేరు సత్యనారాయణ. ఈ సారి బిగ్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌కి శ్రీకారం చుట్టనున్నారు. రమేష్‌వర్మ (Ramesh Varma)తో కోనేరు సత్యనారాయణకు ఇది హ్యాట్రిక్‌ కొలాబరేషన్‌. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో అయిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ఈ తాజా సినిమాలో హీరోగా నటించనున్నారు.

Also Read- Thalapathy69: దళపతి విజయ్ చివరి చిత్ర ప్రకటన వచ్చేసింది..


అత్యంత భారీ వ్యయంతో ప్రాజెక్టును తెరకెక్కించనున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. కొరియోగ్రాఫర్‌గా అత్యున్నత ప్రతిభ కనబరిచి హీరోగా మెప్పిస్తున్న రాఘవ లారెన్స్ కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం గమనార్హం. న‌వంబ‌ర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌‌పై షాడో అవతార్‌లో రాఘవ లారెన్స్ ఇమేజ్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎగ్జయిట్‌మెంట్‌ వర్డ్స్ ప్రాజెక్టుకు ఇన్‌స్టంట్‌గా హైప్‌ పెంచుతున్నాయి. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

Also Read- Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 14 , 2024 | 09:29 PM