మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Radha Madhavam: ‘రాధా మాధవం’ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కు రెడీ

ABN, Publish Date - Feb 16 , 2024 | 05:20 PM

మంచి కంటెంట్‌తో వచ్చే గ్రామీణ ప్రేమ కథా చిత్రాలను ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో.. ఇప్పటికే పలు చిత్రాలు నిరూపించాయి. ప్రేమకు అర్థం చెప్పేలా ప్రస్తుతం ‘రాధా మాధవం’ అనే ఒక గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరోహీరోయిన్లుగా.. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మార్చి 1న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Radha Madhavam Movie Still

మంచి కంటెంట్‌తో వచ్చే గ్రామీణ ప్రేమ కథా చిత్రాలను ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో.. ఇప్పటికే పలు చిత్రాలు నిరూపించాయి. ప్రేమకు అర్థం చెప్పేలా ప్రస్తుతం ‘రాధా మాధవం’ అనే ఒక గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్ (Vinayak Desai), అపర్ణా దేవీ (Aparna Devi) హీరోహీరోయిన్లుగా.. గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’ (Radha Madhavam). ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను సమకూర్చగా.. సతీష్ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూబైఏ సర్టిఫికేట్‌ జారీ చేయడంతో పాటు.. చక్కని సందేశాత్మక చిత్రమని ప్రశంసలు కురిపించినట్లుగా మేకర్స్ తెలియజేశారు. మార్చి 1న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీకి సంబంధించి.. మేకర్స్ ప్రమోషన్స్‌ రేంజ్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు. (Radha Madhavam Censor Completed)


ఇవి కూడా చదవండి:

====================

*Vijay Deverakonda: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..

****************************

*Chiranjeevi: ‘సుందరం మాస్టర్’కు మెగాస్టార్ సపోర్ట్.. ఏం చేశారంటే?

***************************

Updated Date - Feb 16 , 2024 | 05:20 PM