పాట్నాతో ప్రమోషన్స్‌కు శ్రీకారం
ABN, Publish Date - Nov 06 , 2024 | 03:23 AM
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప.. ద రూలర్’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఐటెమ్ సాంగ్ మినహా పూర్తయిన సంగతి విదితమే. ‘పుష్ప’ పార్ట్ వన్‌లో ‘ఊ అంటావా మావ’ అనే...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప.. ద రూలర్’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఐటెమ్ సాంగ్ మినహా పూర్తయిన సంగతి విదితమే. ‘పుష్ప’ పార్ట్ వన్‌లో ‘ఊ అంటావా మావ’ అనే ఐటెమ్ సాంగ్ అందరినీ ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం దానిని మించేలా ఓ సాంగ్ సిద్ధం చేశారు. అల్లు అర్జున్, శ్రీలీలపై బుధవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. గణేశ్ ఆచార్య నృత్య దర్శకుడు. సినిమా ప్రమోషన్స్ ఈ నెల 16 నుంచి పాట్నాతో ప్రారంభిస్తున్నట్లు చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చిత్రజ్యోతికి చెప్పారు. కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు కూడా ఆయన చెప్పారు. విడుదలకు ఇంకా నెల రోజుల వ్యవధే ఉండడంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు రవిశంకర్ చెప్పారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ‘పుష్ప ద రూల్’ చిత్రాన్ని నవీన్ యర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు.