సంక్రాంతికి సిద్ధం

ABN, Publish Date - Nov 02 , 2024 | 06:58 AM

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల జాబితాలోకి మరో పేరు చేరింది. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల జాబితాలోకి మరో పేరు చేరింది. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. వెంకేటశ్‌ లుంగీ ధరించి, తుపాకీ పట్టుకుని సీరియస్‌ పోజులో ఉన్న పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఆయన భార్య పాత్రధారి ఐశ్వర్య రాజేశ్‌ సంప్రదాయ దుస్తుల్లో, మాజీ లవర్‌ పాత్రలో మీనాక్షి చౌదరి మోడరన్‌ లుక్‌లో కనిపించారు.ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని, ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయనీ నిర్మాత శిరీష్‌ చెప్పారు. సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - Nov 02 , 2024 | 06:58 AM