క్రిస్మస్‌ కోసం సిద్ధం

ABN, Publish Date - Oct 30 , 2024 | 05:49 AM

నితిన్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రాబిన్‌ హుడ్‌’ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆరు రోజుల టాకీ వర్క్‌, రెండు పాటలు...

నితిన్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రాబిన్‌ హుడ్‌’ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆరు రోజుల టాకీ వర్క్‌, రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నట్లు దర్శకుడు వెంకీ కుడుముల చెప్పారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంతో జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్‌ మొదటి వారంలో టీజర్‌ విడుదల చేస్తామనీ, క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 20న సినిమాను రిలీజ్‌ చేస్తామనీ నిర్మాతలు నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ చెప్పారు. ‘రాబిన్‌హుడ్‌’ చిత్రానికి సాయి శ్రీరామ్‌ డీవోపీ కాగా, జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 08:42 AM