యుద్ధానికి సిద్ధం
ABN, Publish Date - Aug 04 , 2024 | 03:56 AM
అడివిశేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ సినిమాకి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం ‘గూఢచారి 2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు...
అడివిశేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ సినిమాకి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం ‘గూఢచారి 2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ‘గూఢచారి’ చిత్రం విడుదలై ఆరేళ్లు అవుతున్న సందర్భంగా పార్ట్ 2 నుంచి ఆరు స్టైలిష్ యాక్షన్ స్టిల్స్‌ను శనివారం యూనిట్ విడుదల చేసింది. ‘గూఢచారి 2’ భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోంది’ అని శేష్ చెప్పారు. ఇప్పటికి 40 శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు.