తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ప్రతాని
ABN, Publish Date - Sep 11 , 2024 | 04:10 AM
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కు జరిగిన తాజా ఎన్నికల్లో అధ్యక్షపదవికి ప్రతాని రామకృష్ణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదహారు వేల మంది సభ్యులున్న అసోసియేషన్‌కు...
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కు జరిగిన తాజా ఎన్నికల్లో అధ్యక్షపదవికి ప్రతాని రామకృష్ణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదహారు వేల మంది సభ్యులున్న అసోసియేషన్‌కు ఇలా అధ్యక్షపదవికి ఆయన ఎన్నిక కావడం ఇది ఆరోసారి. ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘నా మీద నమ్మకంతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ రెండేళ్ల పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఔట్‌డోర్ షూటింగ్స్ సమయంలో యూనిట్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, చిన్న సినిమాలకు రాయితీలు వంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం’ అని చెప్పారు.