Pranayagodari: ‘ప్రణయగోదారి’ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేది ఎప్పుడంటే..

ABN, Publish Date - Nov 29 , 2024 | 07:45 PM

డైలాగ్ కింగ్ సాయికుమార్ అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోన్న ‘ప్రణయగోదారి’ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ విడుదల ఎప్పుడంటే..

Sai Kumar in Pranayagodari

సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న విలేజ్ డ్రామా చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranayagodari). పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ (SaiKumar) అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.

Also Read-Samantha: సమంత ఇంట్లో విషాదం.. ఆమె తండ్రి మృతి

ఈ పోస్టర్‌‌ను గమనిస్తే.. సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్‌ని డిజైన్ చేశారు. ఇందులో సాయి కుమార్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, ఆయన వేషధారణ, ఆహార్యం, నటన ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఆయన స్టిల్స్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ స్టిల్స్‌లో ఆయన పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. పాటలు, పోస్టర్‌లు ఇలా అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Pranayagodari Release Date)

Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..


ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న రిలీజ్ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచబోతున్నారు మేకర్స్. ఈ గ్యాప్‌లో సినిమాపై ఆడియెన్స్‌లో హైప్ పెంచేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. మార్కండేయ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈదర ప్రసాద్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించి, తమ సంస్థలో సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలుస్తుందని నిర్మాత చెబుతున్నారు.

Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే

Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్ష‌జ్ఞ'

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2024 | 07:45 PM