Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరో ట్వీట్ పేల్చిన ప్రకాశ్ రాజ్..
ABN, Publish Date - Oct 04 , 2024 | 06:09 PM
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే వరుస ట్వీట్లతో విన్నవింపులు, విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ మరోసారి పరోక్షంగా పవన్‌కి చురకలు అంటించాడు
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే వరుస ట్వీట్లతో విన్నవింపులు, విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ మరోసారి పరోక్షంగా పవన్‌కి చురకలు అంటించాడు. తిరుపతి లడ్డు వివాదంతో మొదలైన వీరిద్దరి పంచాయితీ ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్న సరే ఆయన తగ్గడం లేదు.
గత కొద్దిరోజులుగా ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. శుక్రవారం ఆయన "సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్. All the Best #justasking" అంటూ మరో ట్వీట్ చేశారు. ఈ వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ మీడియాతో సహా పలువురు పవన్ కళ్యాణ్‌పై విసుర్లు విసిరారు. సుప్రీం ఆదేశాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్‌లో మళ్ళీ మతప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మరోసారి ప్రకాష్‌పై ఫైర్ అవుతున్నారు.
Also Read- Jr NTR: అప్పుడు లౌక్యంగా.. ఇప్పుడు డైరెక్ట్‌గా.. ఏంటిది తారక్
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న విషయంపై పవన్ స్పందించినప్పటి నుంచి ప్రకాశ్‌రాజ్ ఇలా ట్వీట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 20న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేస్తూ.. ‘‘మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలను కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు. (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు జస్ట్ ఆస్కింగ్)’’ అంటూ.. పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ట్విట్టర్లో పవన్ కళ్యాణ్‌పై వరుస ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. అవి వైరల్ అవుతూనే ఉన్నాయి.