Prabhuthwa Junior Kalashala: యూత్‌ను ఆకర్షిస్తోన్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’

ABN, Publish Date - Jun 23 , 2024 | 08:48 PM

బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకం‌పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. 2024, జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షిస్తోందని, కలెక్షన్స్ బాగున్నాయని మేకర్స్ ప్రకటించారు.

Prabhutva Junior Kalasala Movie Still

బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకం‌పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’ (Prabhuthwa Junior Kalashala). ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం (Sreenath Pulakuram) ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. 2024, జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షిస్తోందని, కలెక్షన్స్ బాగున్నాయని మేకర్స్ ప్రకటించారు.

Also Read-Anasuya: ఓ షో లో డ్రస్ విప్పేస్తోన్న అనసూయ.. అంత ఆగలేకపోతున్నారా? అంటూ నెటిజన్‌కు రిప్లయ్!


‘‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’ జూన్ 21న విడుదలై నేటి యువతను ఆకర్షిస్తోన్నందుకు సంతోషంగా ఉంది. ఈ వారం మొత్తం 11 చిత్రాలు విడుదల అయ్యాయి, అన్నిచిత్రాల కంటే మా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రం కలెక్షన్స్‌లో ముందుంది. డిస్ట్రిబ్యూటర్స్ సైతం మా చిత్రం బాగుంది అని థియేటర్స్ పెంచుతున్నారు. అలానే సినిమా బాగుంది అనే మాట సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే తమ కాలేజీ రోజులని గుర్తు చేసుకుంటున్నామని చెబుతున్నారు.


సెకండాఫ్‌లో మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. పాటలు సైతం ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్‌కి కూడా మా చిత్రం నచ్చుతుంది. క్లైమాక్స్ చూసి ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఎమోషనల్ గా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. మార్నింగ్ షో కన్నా మాట్నీకి, మాట్నీ కన్నా ఫస్ట్ షో‌కి కలెక్షన్‌లు పెరిగాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు సినిమా బాగుంది అని సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’’ అని దర్శకుడు శ్రీనాథ్ పులకురం (Director Sreenath Pulakuram) చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Jun 23 , 2024 | 08:48 PM